Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్ డేట్స్

బీహార్ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్ డేట్స్

- Advertisement -
  • – ఆధిక్యాల్లో దూసుకెళ్తేన్న ఎన్డీయే 165 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల ముందంజ
    – 73 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోన్న మహాగర్బంధన్ కూటమి అభ్యర్థులు
  • – 5 స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం
  • – ప్రస్తుతం 154 స్థానాల్లో ముందంజలో ఉన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు
  • – 84 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోన్న మహాగఠ్ బంధన్ అభ్యర్థులు
    ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతోన్న జన్సురాజ్ పార్టీ అభ్యర్థి
    రాఘోపుర్లో ముందంజలో కొనసాగుతోన్న తేజస్వీ యాదవ్
    8 స్థానాల్లో సీపీఐ(ఎం) ఆధిక్యం
  • ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే
  • బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి హవా
  • ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు
  • 71 స్థానాల్లో మహాగర్బంధన్ కూటమి అభ్యర్థుల ముందంజ
  • మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యం
  • మేమే గెలవనున్నాం.. మార్పు రానుంది: తేజస్వీ యాదవ్‌ : బిహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
  • ఎన్డీఏ కూటమి 73 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాగఠ్‌బంధన్‌ కూటమి 40 స్థానాల్లో ముందంజలో ఉంది.
  • రాఘోపుర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ముందంజలో ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, మైథిలీ ఠాకూర్ ముందంజలో దూసుకెళ్తున్నారు. బీజేపీ కీలక నేత సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి ముందంజలో ఉన్నారు. అలీనగర్ నుంచి మైథిలీ ఠాకూర్ లీడ్‌లో ఉన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎన్డీయే కూటమి ముందంజ
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం 35 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మహాగఠ్‌బంధన్‌ కూటమి 12 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం లెక్కింపు పూర్తయ్యే టైంకి ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -