నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా బ్లాక్ కూటమి ప్రచారంపై ఫోకస్ పెట్టింది.ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కన్హయ్య కుమార్, స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌తో సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ పాల్గొననున్నారు.
స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో బీహార్ ఎఐసిసి ఇన్‌ఛార్జి కృష్టా అల్లవారు, బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కె.సి వేణుగోపాల్, భూపేష్ బాఘెల్, సచిన్ పైలట్, రణదీప్ సూర్జేవాలా, సయ్యద్ నసీర్ హుస్సేన్, ఆ పార్టీ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, తారిక్ అన్వర్, గౌరవ్ గగొరు, మొహమ్మద్ జావెద్, అఖిలేష్ ప్రసాద్ సింగ్‌లు ఉన్నారు.
అలాగే హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, సీనియర్ నేతలు దిగ్విజరు సింగ్, అధీర్ రంజన్ చౌదరి, మీరా కుమార్, చరణ్‌సింగ్ చన్నీ, అల్కా లంబా, పవన్ ఖేరా, ఇమ్రాన్ ప్రతాప్‌గరి, షకీల్ అహ్మద్, రణ్‌జింగ్ రంజన్, రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, అనీల్ జైహింద్, రాజేంద్రపాల్ గౌతమ్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదల చేసింది.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్‌లో ఆర్‌జెడి, కాంగ్రెస్, వామపక్షపార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. గురువారం మహాగట్బంధన్ తరపున తేజస్వియాదవ్‌ను సిఎం అభ్యర్థిగా ప్రకటించారు.



