Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతాజా వార్తలుబీహార్‌ గ్రామపంచాయతీ అధ్యక్షులతో పాటు పలువురికి ఎన్‌ఐఆర్‌డిపీఆర్‌లో శిక్షణ

బీహార్‌ గ్రామపంచాయతీ అధ్యక్షులతో పాటు పలువురికి ఎన్‌ఐఆర్‌డిపీఆర్‌లో శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీహార్‌ రాష్ట్రానికి చెందిన 117 మంది ముఖియాలు(గ్రామ పంచాయతీ అధ్యక్షులు), నలుగురు పంచాయతీ కార్యదర్శులు, ముగ్గురు యువ నిపుణులకు మూడు రోజుల శిక్షణ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో శిక్షణ గురువారం ప్రారంభమైంది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అంజన్‌కుమార్‌ భంజా ప్రారంభించారు. డాక్టర్‌ చిన్నదురై, డాక్టర్‌ ప్రత్యూష్న పట్నాయక్‌, డాక్టర్‌ అరుణ జయమణి, అజిత్‌ కుమార్‌ సింగ్‌, కడ్తాల్‌ మాజీ సర్పంచి లక్ష్మీనరసింహారెడ్డి, తదితరులు క్లాసులు బోధించారు. అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడంలో ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ పాత్రను వివరించారు. నిరంతర శిక్షణ, ఈ-ఎనేబుల్‌మెంట్‌, శిక్షణ మాడ్యూళ్ల అభివృద్ధి, గ్రామ్‌ప్రశిక్షణ్‌, పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక, వార్డు సభ్యులు సామర్థ్యాల పెంపు తదితరాల గురించి విడమర్చి చెప్పారు. వాటర్‌షెడ్‌ నిర్వహణ, అటవీకరణ, పునరుత్పాదక ఇంధన స్వీకరణ, జీపీడీపీల ద్వారా వికేంద్రీకృత ప్రణాళిక వంటి వినూత్న పద్ధతుల ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ పాత్రను వివరించారు. డాక్టర్‌ చిన్నదురై మాట్లాడుతూ.. పంచాయతీలలో పాలనలో ఉత్తమ పద్ధతులను అవలంబించాలని సూచించారు. మూడు రోజుల కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కేంద్ర అవార్డులు గెలుచుకున్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎక్స్‌పోజర్‌ సందర్శన ఉంటుంది. పంచాయతీల అభివృద్ధిలో వినూత్న పద్ధతులు, విజయగాథలను ప్రదర్శించడం ద్వారా ముఖియాలకు ఉపయోగపడనున్నది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad