నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో జేడీ(యు) నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో నేరాలు, అవినీతి విపరీతంగా పెరిగాయని ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్షనేత తేజస్వియాదవ్ తీవ్రంగా ఆరోపించారు. నితీష్‌కుమార్ ప్రభుత్వం అధికారంలో రాష్ట్రాభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీహార్‌లో నేరాలు, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయి. ఇదీ బీహార్ పరిస్థితి. ఇక విద్య, నీటిపారుదల, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. రాష్ట్ర తలసరి ఆదాయం, తలసరి పెట్టుబడి విషయానికొస్తే చాలా అత్యల్పంగా ఉంది. రైతుల ఆదాయాల్లో బీహార్ చివరి స్థానంలో ఉంది. ఎలాంటి పరిశ్రమ లేదు. వ్యాపారం లేదు’ అని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలనుద్దేశించి నితీష్ కుమార్ ఎన్నేళ్లున్నా.. రాష్ట్రాభివృద్ధి జరగలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఎన్డీయే పాలనలో బీహార్ పరిస్థితి అధ్వానం: తేజస్వియాదవ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES