Wednesday, October 15, 2025
E-PAPER
Homeసినిమాకబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో 'బైసన్‌'

కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ‘బైసన్‌’

- Advertisement -

ధవ్‌ విక్రమ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బైసన్‌’. నీలం స్టూడియోస్‌, అప్లాజ్‌ ఎంటర్టైన్మెంట్‌ నిర్మాణంలో ఇది రూపొందింది. దర్శకుడు పా రంజిత్‌ సమర్పణలో మారి సెల్వరాజ్‌ దర్శకుడుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 24న జగదంబే ఫిలిమ్స్‌ ప్రొడ్యూసర్‌ బాలాజీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో దగ్గుబాటి రానా రిలీజ్‌ చేసి, టీమ్‌కు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. నిర్మాత బాలాజీ మాట్లాడుతూ, ‘ఈ చిత్ర ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంటూనే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ధవ్‌ తనదైన యాక్షన్‌ పర్ఫామెన్స్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేస్తున్నారు.

స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అలాగే ఇప్పుడు కబడ్డీ బ్యాక్‌గ్రౌండ్‌లో రాబోతున్న ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నా. ఈ చిత్రాన్ని నాకు తెలుగులో విడుదల చేసే అవకాశాన్నిచ్చిన నీలం స్టూడియోస్‌, అప్లాజ్‌ ఎంటర్టైన్మెంట్‌ సంస్థలకు ధన్యవాదాలు’ అని అన్నారు. ధవ్‌ విక్రమ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌ : శక్తి తిరు, ఆర్ట్‌ డైరెక్టర్‌: కుమార్‌ గంగప్పన్‌, మ్యూజిక్‌ : నివాస్‌ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ : ఏజిల్‌ అరసు.కె.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -