Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబీహార్‌లో కాంగ్రెస్ శ్రేణుల‌పై బీజేపీ దాడి

బీహార్‌లో కాంగ్రెస్ శ్రేణుల‌పై బీజేపీ దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బీహార్ రాజ‌ధాని పాట్నాలో ఉద్రిక్త‌త నెల‌కొంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు కర్రలు, రాళ్లతో కొట్టుకుని బీభత్సం సృష్టించారు. తలలు పగిలేలా రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరి దాడి చేశారు.

అదే విధంగా మోడీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తపై బీజేపీ ఫిర్యాదు చేసింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మోడీని హిందీలో దూషిస్తున్నట్టుగా వీడియోలు దర్శనమిచ్చాయి. ఇక నిందితుడు సింగ్వారాలోని భాపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్‌ ఇప్పటివరకు స్పందించలేదు.

బీహార్‌లో ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న ముగియనుంది. ఈ యాత్రలో భాగంగా దుర్భంగా పట్టణంలో నిర్వహించిన సభలో కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు మోడీ, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆరోపించింది.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను బీజేపీ, మిత్రపక్షాలు ఖండించాయి. నితీష్ కుమార్, అమిత్ షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తీవ్రంగా ఖండించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad