Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహిల్ట్‌ విధానంపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

హిల్ట్‌ విధానంపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న హిల్ట్‌ విధానంపై బీజేపీ రాష్ట్ర శాఖ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు, శాసనసభాపక్షనేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి తూళ్ల వీరేందర్‌గౌడ్‌, ఎన్వీ సుభాష్‌ తదితరులు ఉన్నారు. హైదరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం’ హైదరాబాద్‌ ఇండిస్టీయల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌(హిల్ట్‌) విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. ‘హిల్ట్‌ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తొమ్మిది వేల ఎకరాలను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అప్పటి, ఇప్పటి ధరలు పొల్చిచూస్తే అక్రమాలు తెలుస్తున్నాయి..కోకాపేటలో భూముల ధర ఇటీవల ఎంత పలికిందో మనం చూశాం. ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తున్నది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ డిసెంబరు ఏడున ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తాం. జీహెచ్‌ఎంసీ విస్తరణలోనూ అనేక కుట్రలు ఉన్నాయని’ బీజేపీ నేతలు అరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -