Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబీజేపీకి క్రాస్‌ ఓటింగ్‌ భయం

బీజేపీకి క్రాస్‌ ఓటింగ్‌ భయం

- Advertisement -

మోడీ-ష్వా ద్వయానికి అగ్ని పరీక్ష !
ఉప రాష్ట్రపతి ఎన్నికలో అనూహ్య ఫలితం వస్తుందని ఆందోళన
కేంద్రంలోని పాలకపక్షంలో కలవరపాటు

న్యూఢిల్లీ : భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక మోడీ-షా ద్వయానికి అగ్ని పరీక్షగా నిలవబోతోందా? పార్లమెంటులో ప్రస్తుత బలాబలాలను బట్టి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థికే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని స్పష్టమవుతున్నప్పటికీ కాషాయపార్టీ నాయకత్వంలో కలవరపాటు కన్పిస్తోందా? క్రాస్‌ ఓటింగ్‌ భయం కమలదళాన్ని వెంటాడుతోందా? తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో అనూహ్య ఫలితం వస్తుందని, ప్రతిపక్ష అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయని ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. ఒకవేళ పాలక పక్షం భయపడుతున్నట్టు నిజంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగితే ఫలితం అనూహ్యం, ఆశ్చర్యకరమే అవుతుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

ప్రస్తుత రాజకీయ అనిశ్చిత పరిస్థితులను మోడీ తనకు తానుగానే కొని తెచ్చుకున్నట్టుగా కన్పిస్తోంది. ఎందుకంటే ఆయన పట్టు క్రమేపీ సడలిపోతోంది. బీజేపీ శిబిరం నుంచి ప్రతిపక్ష అభ్యర్థి కొన్ని ఓట్లను రాబట్టుకొని ఓటమి పొందినప్పటికీ మోడీ తన భవిష్యత్తులపై ఆందోళన చెందక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. అలా కాక బీజేపీ అభ్యర్థే ఓటమి చెందితే ప్రధాని పదవిలో ఆయన కొనసాగడం కష్టం కావచ్చని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష అభ్యర్థి రాజ్యసభ చైర్‌పర్సన్‌ అయితే కేంద్రంలో ప్రభుత్వ మనుగడ ప్రశార్థకమవుతుంది. ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ పార్టీలు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిని బరిలో దింపిన విషయం తెలిసిందే.

దేశంలోని ఒక అత్యున్నత పదవికి తెలుగువాడు బరిలో ఉండటంతో.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్‌ పని చేస్తుందన్న అంశాన్ని కూడా కొట్టిపారేయలేమని విశ్లేషకులు చెప్తున్నారు. తెలుగువాడన్న సెంటిమెంట్‌తో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని ఎంపీలు డైలమాలో పడిపోయారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి పార్లమెంటు ఉభయ సభలలో 18 మంది సభ్యులు, రాష్ట్ర అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. ఒకవేళ వీరందరూ ప్రతిపక్ష అభ్యర్థికి ఓటు వేసినప్పటికీ ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ 392కు చేరుకోగలదు. అయినా మోడీ-షా ద్వయంలో ఆ అభద్రతా భావం వీడడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఎన్నికల్లో అంబానీ గ్రూపు వేలు?
బిజూ జనతాదళ్‌(బీజేడీ), బీఆర్‌ఎస్‌, ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలు ప్రతిపక్ష అభ్యర్థిని సమర్ధిస్తే మాత్రం ఎన్డీఏ తరఫు అభ్యర్థి విజయం కష్టమవుతుందని విశ్లేషిస్తున్నారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు దీనికి తోడైతే కథ ముగిసినట్టేనని అంటున్నారు. ఇదిలావుంటే ఉప రాష్ట్రపతి ఎన్నికలో అంబానీ గ్రూప్‌ నిర్వహించే పాత్రపై వదంతులు వ్యాపిస్తున్నాయి. అనిల్‌ అంబానీపై దాడులు, వంతారాపై దర్యాప్తు వంటి పరిణామాలతో పాలక పక్షంపై అంబానీ గ్రూప్‌ ఆగ్రహంతో ఉంది. ఉప రాష్ట్రపతి ఎన్నికను ఉపయోగించుకొని ప్రభుత్వంపై మరింత పట్టును సంపాదించాలని ఈ సంపన్న గ్రూపు ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

బలహీనంగా మోడీ
ఏదేమైనా మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ కోసం మోడీ-షా ద్వయం తవ్విన గొయ్యి ఇప్పుడు చాలా విస్తృతమైందనీ, యావత్‌ ప్రభుత్వాన్ని ఆ గొయ్యి తనలోకి లాక్కునే ప్రమాదం కన్పిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో విజయం కోసం ఎన్డీఏ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఎంపీలకు మోడీ, షా ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. అంతటితో ఆగడం లేదు. విందు కార్యక్రమాలు, వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 56 ఇంచుల ఛాతీ అంటూ గతంలో అనేక సందర్భాల్లో ప్రసంగించిన మోడీ.. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా కనిపిస్తున్నారు. గాయన ఇంత బలహీనంగా గతంలో ఎన్నడూ కన్పించలేదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad