నవతెలంగాణ-హైదరాబాద్: GST పేరుతో 9ఏండ్లుగా దేశప్రజల సొమ్మును బీజేపీ దోపిడి చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రూ.22 లక్షల కోట్ల నుంచి కేవలం రూ.2 లక్షల కోట్లు జీఎస్టీ తగ్గించి ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఎంపీ రఘనందన్ జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి రూ.15వేలు మిగిల్చామని చెప్పుతున్నారు, అయితే తొమ్మిది ఏండ్ల నుంచి జీఎస్టీ రూపంలో పేదల కష్టార్జితాన్ని దోచ్చుకున్నారని ఆయన మాటలతో తెటతెల్లమవుతుందని ఆయన విమర్శించారు. 2017 సంవత్సరము నుండి పప్పు, ఉప్పు, సబ్బు,నూనె,షర్ట్, పాయింట్, టివి,సైకిల్ మోటార్, కారు ఇలా అన్నిరకాల వస్తువుల ధరలు పెంచి ప్రజల నుంచి అధిక పన్నులు బీజేపీ ప్రభుత్వం వసూలు చేసిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలకు బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెపుతారని ధ్వజమెత్తారు.
GST పేరుతో దేశప్రజల సొమ్మును బీజేపీ దొచ్చుకుంది: వేముల ప్రశాంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES