నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా బ్లాక్, ఆర్జేడీ కలిసి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మహాగఠ్‌బంద్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌తో కలిసి బీహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఎన్డేయే భాగస్వామి జేడీయూపై రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. నితిష్ మొఖాన్ని వాడుకొని బీజేపీ ఓట్లు పొందాలని చూస్తుందని, రీమొంట్ మాదిరిగా నితిష్ ప్రభుత్వాన్ని బీజేపీ కంట్రోల్ చేస్తుందని ఆయన విమర్శించారు.
ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి నితిష్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నారని, రాష్ట్రంలో అధిక సంఖ్యలో వెనుకబడిన తరుగతులకు న్యాయం చేయాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో కులగణన చేపట్టాలని పీఎం మోడీని తాను డిమాండ్ చేశానని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కానీ ప్రధాని మోడీ కులగణనపై స్పందించకుండా మౌనంగా ఉన్నారని విమర్శించారు. సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకమని రాహుల్ గాంధీ అన్నారు. బీసీ వర్గాలు సామాజిక న్యాయం ద్వారా లబ్ధిపొందడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టముండదని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో చిన్ని తరహా పరిశ్రమల నట్టేట ముంచారని ఆరోపించారు. జీఎస్టీతో చిన్నపరిశ్రమలను పీఎం మోడీ నాశనం చేశారని ధ్వజమోత్తారు.
దేశంలోనే అధిక పేదరికం, నిరుద్యోగం బీహార్ లోనే ఉందని, మహాగఠ్‌బంద కూటమి అధికారం చేపట్టగానే యువతకు ఉపాధి, రాష్ట్రంలో పేదరికం, నిరుద్యగోం లేకుండా చేస్తానని తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రతి ఇంటికో ఉద్యోగాన్ని కల్పించ బీహార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.



