ఎమ్మెల్యే మిశ్రిలాల్ యాదవ్ రాజీనామా
పాట్నా : బీజేపీ దళిత వ్యతిరేకి అని బీజేపీ ఎమ్మెల్యే మిశ్రిలాల్ యాదవ్ అన్నారు. ఆ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దర్బాంగా జిల్లాలోని అలీనగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైశ్వాల్‌కు రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. చాలా ఏండ్ల నుంచి కండబలం, ధనబలం ఉన్న వారు కూడా అలీనగర్ స్థానంలో గెలవలేకపోయారని, మొదటిసారి ఎన్డీఏ తరపున 2020లో తాను గెలిచానన్నారు. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) తరఫున గెలిచిన ఆయన ఆ తరువాత బీజేపీలో చేరారు. సింగర్ మైథిలీ ఠాకూర్‌కు అలీనగర్ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మిశ్రి రాజీనామా ప్రకటించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.