నవతెలంగాణ-హైదరాబాద్: మనువాదం,,మనుస్మృతి దేశాన్ని నాశనం చేస్తున్నాయి, ఆ భావజలం దారిలో పీఎం మోడీ, బీజేపీతో పాటు దాని అనుబంధ సంఘాలు నడుస్తుయని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. దేశంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ తోనే దేశ రక్షణ సాధ్యమని ఆయన చెప్పారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓట్ చోరీ-గద్ది ఛోడ్ పేరుతో మహాధర్నా నిర్వహించింది కాంగ్రెస్.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ లీలా మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘ దేశాన్ని, ఓటును,రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకుంటే..మన భావజాలం, ఆలోచనలను ముందుకు తీసుకురావడానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, నేడు ప్రియాంక గాంధీలతో కలిసి ప్రజలు పోరాటంలో భాగస్వామ్యం కావాలని ఖర్గే పిలుపునిచ్చారు.



