Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఎన్నికైన ప్ర‌భుత్వాల హ‌క్కుల‌ను బీజేపీ కాల‌రాస్తోంది: సీఎం స్టాలిన్‌

ఎన్నికైన ప్ర‌భుత్వాల హ‌క్కుల‌ను బీజేపీ కాల‌రాస్తోంది: సీఎం స్టాలిన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: 1931 జులై 13న అమరులైన అమరవీరులకు జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సోమవారం గోడ దూకి మరి నివాళులర్పించారు. ఒక రాష్ట్ర సిఎంనే నిర్బంధించి బిజెపి ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తుందో ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడు నుండి కాశ్మీర్‌ వరకు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను క్రమపద్ధతిలో హరిస్తుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్‌ పెరుగుతున్న సమయంలో.. అక్కడ జరుగుతున్న ప్రస్తుత సంఘటనలు పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నాయో గుర్తు చేస్తున్నాయి. ఎన్నికైన ముఖ్యమంత్రిని 1931 అమరవీరులకు నివాళులర్పించకూడదనే ఉద్దేశంతోనే ఆయనను గృహనిర్బంధం చేశారు. అలా చేయడం వల్లే ఆయన గోడలు ఎక్కాల్సి వచ్చింది. ఎన్నికైన ముఖ్యమంత్రి పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? ఇది కేవలం ఒక రాష్ట్రం లేదా ఒక నాయకుడి గురించి కాదు’ అని స్టాలిన్‌ మంగళవారం ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img