Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమహిళా ఐపీఎస్‌ను కుక్కతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే...

మహిళా ఐపీఎస్‌ను కుక్కతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే మహిళా పోలీస్ ఉన్నతాధికారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్‌ను ఉద్దేశించి, ఆమె కాంగ్రెస్ నేతల ఇంట్లో ‘పెంపుడు కుక్క’లా వ్యవహరిస్తున్నారంటూ హరిహర బీజేపీ ఎమ్మెల్యే బి.పి. హరీశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వయంగా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం దావణగెరెలోని కేటీజే నగర్ పోలీస్ స్టేషన్‌లో హరీశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మంగళవారం దావణగెరెలో రిపోర్టర్స్ గిల్డ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ మాట్లాడుతూ.. “నేనొక ఎమ్మెల్యేని. కానీ, ఎస్పీ నన్ను ఏదైనా కార్యక్రమంలో చూస్తే ముఖం చిట్లించుకుంటున్నారు. అదే కాంగ్రెస్‌కు చెందిన శమనూరు కుటుంబ సభ్యుల కోసం మాత్రం గేటు వద్ద పడిగాపులు కాస్తున్నారు. అచ్చం వాళ్లింట్లోని పోమరేనియన్ కుక్కలా ఆమె ప్రవర్తన ఉంటోంది” అని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శమనూరు శివశంకరప్ప ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన కుమారుడు ఎస్.ఎస్. మల్లికార్జున్ రాష్ట్ర మంత్రిగా, కోడలు ప్రభా మల్లికార్జున్ దావణగెరె ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad