నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్ తన పదవికి రాజీనామా చేయాలని హిమాచల్ లో మహిళాల ఆందోళనలు మిన్నట్టాయి. మైనర్‌పై లైంగిక వేధింపులను నిరసిస్తూ సిమ్లాలోని డిప్యూటీ కమిషన్ కార్యాలయం వద్ద అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం(AIDWA) భారీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హన్స్ రాజ్ ను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్యా నాయకురాలు డిమాండ్ చేశారు.
మైనర్‌ను లైంగికంగా వేధించిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని, సదురు వ్యక్తికి బెయిల్ మంజూరు చేశారని, కానీ పోక్సో చట్టం ప్రకారం, సాధారణంగా బెయిల్ అనుమతించబడదని తెలియజేశారు.. ఈ నిరసన ద్వారా అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఐద్యా అధ్యక్షురాలు ఫాల్మా చౌహాన్ డిమాండ్ చేశారు. అతనికి మంజూరు చేసిన బెయిల్ కూడా రద్దు చేయాలని, బాధితురాలికి, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, బాధితులకు న్యాయం అందకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.



