ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టచార్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీజేపీ తిరోగమన విధానాలతో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టచార్య విమర్శించారు. మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ లో రాష్ట్ర అధ్యక్షులు శనిగారపు రజినీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భట్టాచార్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పేదలు, మధ్యతరగతి విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాటిని మూసేసేం దుకు, అంగన్వాడీలను ఎత్తేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. విద్యారంగంలో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేసి భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. విద్యార్థులకు పాఠశా లల్లో అందించే మధ్యాహ్నం భోజనం రేట్లు పెంచా మని బీజేపీ గొప్పలు చెప్పుకుంటుందనీ, రూ.12తో కడుపునిండా భోజనం లభిస్తుందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో విద్యారంగంపై నిర్లక్ష్యం : తాళ్ల నాగరాజు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు మాట్లాడుతూ విద్యాశాఖకు మంత్రిగా నియమించకుండా సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మెస్, కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయకపోవడంతో హాస్టళ్ల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని విద్యార్థులు, కళాశాలల యజమాన్యాలు ఆందోళన చేస్తుంటే ఆ కళాశాలలపై ఏసీబీ దాడులు నిర్వహించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. గత ఆరు సంవత్సరాల ఉపకారవేతనాలు రూ.1,924 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌్ రూ.8,042 కోట్లు బకాయిలో ఉన్నాయని గుర్తుచేశారు. విద్యార్థులు, యాజమాన్యాలు రోడ్లపైకి వస్తుంటే కాంగ్రెస్ సర్కారు నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. విద్యార్థులను విస్మరించిన ప్రభుత్వాలు బతికి బట్టకట్టలేదన్న చరిత్ర గుర్తుపెట్టుకోవాలని కోరారు. విద్యారంగ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షంచి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత, కేంద్ర కమిటీ సభ్యులు, ఖమ్మం పాటి శంకర్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు అశోక్ రెడ్డి, యార ప్రశాంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, దీపికా, భరత్, తారా సింగ్ ,ఆకారపు నరేష్, అభినవ్, లెనిన్, రాజు, సాయి, రమ్య, కుర్ర సైదా నాయక్, అభిషేక్, రాజు, రాజేష్, సయ్యద్, రవి తదితరులు పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బీజేపీ విధానాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



