నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లోని అర్రా నియోజకవర్గం మాజీ ఎంపీ ఆర్‌కే సింగ్ పై బీజేపీ అధిష్టానం వేటు వేసింది. బీహార్ ఎన్నికల వేళ పార్టీకి ప్రతికూలంగా వ్యవహరించారని, పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగంగా మాట్లాడారని..బీజేపీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. ఆర్‌కే సింగ్ తన వ్యాఖ్యలపై వారంలోపు సమాధానమివ్వాలని ఈమేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది.
అర్రాకు చెందిన మాజీ ఎంపీ ఆర్‌కె సింగ్, పార్టీ అంతర్గత స్థితిగతులతో తనకున్న విభేదాల గురించి తీవ్రంగా మాట్లాడాడు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జేడీ(యు) నాయకుడు అనంత్ సింగ్‌తో సహా అనేక మంది ఎన్‌డిఎ నాయకులను విమర్శించాడు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఈసీ విఫలమైందని, పోలింగ్ టైంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆర్‌కే సింగ్ కార్యకలాపాలు పార్టీకి హాని కలిగించాయని, తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి లోనయ్యాయని బీజేపీ సస్పెన్షన్ నోటీసులో పేర్కొంది.



