- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఉప్పల్ కు చెందిన బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా రాజు తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తన తల్లి కొట్టొద్దని వేడుకున్నా సరే విచక్షణ కోల్పోయి తల్లిని చెంప మీద కొట్టాడు. కాలితో తన్నాడు. ఆ సంఘటన వీడియో వైరల్ అయి పరువు పోయిందని మనోవేదనకు గురై సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -