నవతెలంగాణ – అచ్చంపేట : సర్పంచ్ గా ఆశీర్వదించండి ఐదేళ్లు మీకోసం, గ్రామ అభివృద్ధి కోసం కష్టపడతానని కాంగ్రెస్ పార్టీ ఘనపూర్ సర్పంచ్ అభ్యర్థి ఇస్లావత్ చిన్ని గన్యా నాయక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు విజ్ఞప్తి చేశారు. అంతర్గత మట్టి రోడ్లను సిసి రోడ్లుగా మారుస్తానని, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించకుండా పరిశుభ్రత గా ఉంచుతానని, వీధి లైట్లు ఏర్పాటు, ఇంటింటికి మిషన్ భగీరథ పైపులైను ద్వారా నీరు అందిస్తామని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తారని తెలిపారు.
ఆపద సమయంలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు, మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం, వృద్ధులకు ప్రతినెలా పింఛన్ 2016/-, వికలాంగులకు ప్రతినెల రూ.4016/- పింఛన్లు, ప్రతి ఇంటికి ఉచిత కరెంటును అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని సర్పంచ్ గా మీరు ఆశీర్వదిస్తే గ్రామంలో సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పని చేస్తానని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మహిళలు, యువకులు ఉన్నారు.



