కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆరె మధు గౌడ్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
రామాజీపేట గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ ఎన్నికలలో ఉంగరం గుర్తు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆరె మధు గౌడ్ అన్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామంలోని వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ గ్రామ నాయకులు కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ సమస్యలను పరిష్కారం చేస్తానని అన్నారు.
ఆపదలో ఆదుకుంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ తోటే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అందజేసింది అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి సొంతంటి కల నెరవేరుతుందని, గ్రామాల్లో చెరువులు నిండడంతో రైతుల సంతోషంగా ఉన్నారని అన్నారు. పేదలకు ఉచిత సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలతో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బీర్ల శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్ధులు, డిసిసిబి డైరెక్టర్ మొగిలిపాక రామ్ చందర్, మాజీ ఉపసర్పంచ్ వీరవెల్లి శేఖర్ రెడ్డి, మొగిలిపాక శంకర్, జాంగిర్, నరేష్, మల్లేష్, కొమురయ్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.



