ఇవేమి చదువులు ఇవేమి బాధలు
బాల్యము నిండా నెత్తుటి మరకలు
లేదొక ఆట లేదొక పాట
లేచిన మొదలు ర్యాంక్‌ల వేట
హరివిల్లెక్కడ ఆనందమెక్కడ
వానలో తడిసే సంభ్రమమెక్కడ
నీళ్ళలో వదిలే పడవలు లేవు
ఎండలో ఎగిరే పతంగులు లేవు
మోటబావుల ఈతలు లేవు
వాగుల వంకల గంతులు లేవు
ఒంగుడు దూకుడు కాళ్లాగజ్జ
సాంప్రదాయ సత్ క్రీడలెక్కడ
రాత్రులు ఆడే ఉప్పు బేరలెక్కడ
జాము రాత్రి చిందు భాగవతాలెక్కడీ
గాత్రం లేదు, గానం లేదు
కళలను తడిమే తావే లేదు
ఇంటికి వస్తే హోం వర్కుల గోస
బడికి వెళ్ళితే పరీక్షల గోల
పసిమనసెక్కడ పసితనమెక్కడ
ఎక్కడ ఎక్కడ జ్ఞానపు వెలుగులు
గంతులు వేసే బాల్యం లేదు
ప్రకృతి కాంతతో స్నేహం లేదు
కోతి కొమ్మచ్చి, బలిగుడు ఆటలు
కలికంకైనా కనపడవిప్పుడు
తాతలు చెప్పే గాధలు లేవు
అమ్మమ్మ సందిట కబుర్లు లేవు.
ఉన్నదొక్కటే చదువూ .. చదువూ..
సైన్సూ… మ్యాసూ.. కంపుటర్లు..
నాన్న కోపంతో ర్యాంకుల కుస్తీ ..
పొరిగింటోళ్ళతో అమ్మకు పోటీ
ర్యాంకు లెవడిని రోదనెనడిది
బోధన మాటున కరెన్సీ ఎవడిది
చిట్టి బుర్రలో సెను విస్పోటాలు
బాల బాలికల హృదయ ఘోషలు
చదువుల సంకెల తీరని శోకం
లే ప్రసూనాల మరణ మదంగం
బాల్యం చదువులో బందీకాగా
కార్పొరేట్ లో కన్నీటి కాలువలు
చదువే బరువై బతుకే భయమై
నూయ్యో .. గొయ్యో … కవ్విస్తున్నది.
– పుప్పాల కృష్ణ మూర్తి, 9912359345
నెత్తుటి మరకలు
- Advertisement -
- Advertisement -