బానోత్ సీతారాం నాయక్ సర్పంచ్ లక్నవరం
నవతెలంగాణ – గోవిందరావుపేట
బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ రెడ్డి సేవలు ముందు ముందు గ్రామానికి ఎంతో అవసరమని లక్నవరం సర్పంచ్ భానోత్ సీతారాం నాయక్ అన్నారు. శనివారం లక్నవరం పంచాయతీ దుంపలగూడెం గ్రామంలో విజయ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. అనంతరం సీతారాం నాయక్ మాట్లాడుతూ హైదరాబాదులో స్థిరపడిన విజయ రెడ్డి బాల్యం ఈ గ్రామంలో కొనసాగిన కారణంగా గత 15 సంవత్సరాలుగా గ్రామానికి ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు.
ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు సుమారు రెండు లక్షల విలువ చేసే పుస్తకాలు నోట్బుక్కులు పెన్నులు కంపాస్ బాక్సులు షూలు ఆట వస్తువులను అందిస్తున్నారని ఈరోజు కూడా తన పుట్టినరోజు సందర్భంగా అందించడం గొప్ప విశేషం అన అన్నారు. అలాగే దేవాలయ నిర్మాణానికి మరియు మినరల్ వాటర్ ప్లాంట్ కు ఇప్పటివరకు దాదాపు 5 లక్షల పైన ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. విజయ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకు వృద్ధులకు చలిని తట్టుకునే విధంగా రగ్గులు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. విజయ రెడ్డి ఆరోగ్యంగా ఉండి మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ సేవలను ప్రజలకు ముందు ముందు మరింత అందించాలన్న ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.
మహిళా సంఘాలకు మీటింగ్ ఖర్చుల నిమిత్తం వాడుకోవడానికి డబ్బులు చెక్కుల రూపంలో అందజేశారన్నారు. ఈ కార్యక్రమం లో లక్నవరం గ్రామ ఉప సర్పంచ్ బండి రాజశేఖర్, మరియు వార్డు మెంబర్లు , పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



