- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన బొబ్బిలి రాజు గౌడ్ శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉప సర్పంచ్ల సమావేశంలో జిల్లా ఉప సర్పంచ్ల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ.. ఇందుకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, ఉప సర్పంచ్ల రాష్ట్ర, జిల్లా కమిటితోపాటు అన్ని గ్రామాల ఉప సర్పంచ్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిస్కారం అయ్యేలా చుస్తామన్నారు.
- Advertisement -



