బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరో,హీరోయిన్‌గా మెహర్ యరమతి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. యువ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎస్కేఎన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి కెమెరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించారు.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత యువకృష్ణ మాట్లాడుతూ,’డైరెక్టర్ మెహర్ నా స్నేహితుడు. తను అద్భుతమైన స్క్రిప్లు చెప్పాడు. నటనకి చాలా మంచి స్కోప్ ఉన్న కథ. ఈ కథ వినగానే మొదట నాకు బాబీ సింహ గుర్తొచ్చారు.
కథ ఆయనకూ చాలా నచ్చింది. వెంటనే చేద్దామని ఆయన చెప్పడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది’ అని తెలిపారు. ‘ఇది దర్శకుడిగా నా తొలి సినిమా. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు మెహర్ చెప్పారు. హీరో బాబీ సింహ మాట్లాడుతూ,”వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో హీరోగా చేయాలని ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో యువ దగ్గర నుంచి కాల్ వచ్చింది. స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా నచ్చింది. ఒక యాక్టర్‌ని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్ ఇది. నా కెరియర్ లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.
బాబీ సింహా కొత్త సినిమా మొదలైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



