Wednesday, October 22, 2025
E-PAPER
Homeకరీంనగర్ఐదేళ్లుగా మార్చురీలోనే మృతదేహం

ఐదేళ్లుగా మార్చురీలోనే మృతదేహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐదేళ్లుగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి మృతదేహం మార్చురీలోనే ఉన్న ఘటన బహ్రెయిన్లో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన నరేశ్(40) ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లి 2020 మేలో మరణించాడు. అయితే ఈ సమాచారం లేక కుటుంబసభ్యులు ఐదేళ్లుగా ఎదురుచూశారు. ఇటీవల అధికారులు మృతిడి వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహం అక్కడి మార్చురీలో భద్రపరిచారు. మృతదేహం రప్పించాలని సోదరుడు ఆనంద్ దరఖాస్తు చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -