Tuesday, January 27, 2026
E-PAPER
Homeకరీంనగర్స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ కార్మికుడి మృతదేహం

స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ కార్మికుడి మృతదేహం

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన పడాల(కట్ట) గంగారెడ్డి(45)సౌదీ అరేబియాలో గుండెపోటుతో ఈ నెల 6న మృతి చెందాడు. స్వగ్రామం వచ్చి సౌదీకి తిరిగి వెళ్లిన 16వ రోజున ఆయన మృతి చెందగా.. 21 రోజుల అనంతరం మంగళవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహం తరలింపులో జాప్యం జరగడంతో భార్య స్వప్న ,ఇద్దరు పిల్లలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గంగారెడ్డి మృతితో కుటుంబం అనాథగా మారగా, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -