కథానాయకుడు యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్ :ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. యష్ పుట్టినరోజు నేపథ్యాన్ని పురస్కరించుకుని మేకర్స్ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. రాయగా నటిస్తున్న యష్ క్యారెక్టర్ ఇంట్రో టీజర్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ టీజర్‌తో యష్ నటించిన రాయ పాత్ర పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఈ టీజర్‌ను రూపొందించారు. అభిమానులు, సినీ వర్గాలు భారీ అంచనాలతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో రాయ పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ ఇంట్రో సెలబ్రేషన్‌లా కాకుండా ఓ స్టేట్‌మెంట్‌లా ఉంది. దీంతోపాటు యష్ పాత్రకంటే ముందు ఇందులో నటిస్తున్న కథానాయికల పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్.కె నారాయణ, యష్ నిర్మిస్తున్న ఈచిత్రాన్ని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
బోల్డ్ అండ్ పవర్‌ఫుల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



