నవతెలంగాణ-హైదరాబాద్: బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి అస్సాం బీజేపీ చేసిన ఇస్లామోఫోబిక్ పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది అస్సాం రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటినుంచే విద్వేష రాజకీయలను మొదలుపెట్టింది అస్సాం బీజేపీ. ఇందులో భాగంగా.. అస్సాం బీజేపీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్.. ఎక్స్ వేదికగా ఏఐ సాయంతో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మైనారిటీ వర్గాన్ని కించపరిచినట్లు క్లియర్‌గా కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో మతపరమైన ద్వేషాన్ని పెంచేలా ఉందని శ్రేయా ధన్వంతరి ఆగ్రహాం వ్యక్తం చేసింది. బీజేపీ పోస్ట్ చేసిన వీడియోపై శ్రేయా స్పందిస్తూ.. ”ఇది ఇండియా కాదని. ఈ వీడియో చాలా ద్వేషపూరితంగా, తప్పుగా ఉందని పేర్కొంది. ఈ రకమైన ద్వేషపూరిత ప్రచారం ఎవరూ అడ్డుకోకుండా సాగిపోతుందా? అసలేం జరుగుతోంది ఇండియాలో?” అంటూ ఆమె ప్రశ్నించింది. మరోవైపు శ్రేయానే కాకుండా పలువురు ప్రముఖులు ఈ వీడియోపై స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు.
బీజేపీ పోస్టుపై బాలీవుడ్ నటి ఆగ్రహాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES