Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. గురువారం సాయంత్రం ముంబైలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తానని సల్మాన్ ఖాన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వీరిద్దరి మధ్య జరిగిన చర్చల పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ, తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచ స్థాయిలో ఇనుమడింపజేసే అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘#TelanganaRising’ (తెలంగాణ రైజింగ్) అనే సందేశాన్ని ప్రపంచ నలుమూలలకూ తీసుకెళ్తానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -