Saturday, October 18, 2025
E-PAPER
Homeజాతీయంఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలకు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ నివాసానికి కూడా ఇవాళ బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని ఉపరాష్ట్రపతి నివాసానికి ఈ బెదిరింపులు వచ్చాయి. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు పెట్టినట్లు అందులో పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో దాన్ని నకిలీ బెదిరింపుగా తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -