నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో రెండు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. స్థానికంగా సాధిక్ నగర్, లక్ష్మినగర్‌లోని ప్రియదర్శిని విహార్‌లోని లవ్లీ పబ్లిక్ సీనియర్ సెకండరీ స్కూల్‌కు బుధవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్ బృందం స్కూల్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరీశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులతో బాంబు ఆనవాళ్ల కోసం సోదాలు చేశారు. అదే విధంగా స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తులు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో స్కూల్‌లోని విద్యార్థులందర్నీని తక్షణమే ఇంటికి పంపించారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్కూల్ ఎదుట ఫైర్ ఇంజన్, అంబులెన్స్ వాహనాన్ని సిద్ధంగా ఉంచారు.
ఢిల్లీలో ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



