నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల వరుస బాంబు బెదిరింపు సంఘటనలు దేశంలో కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇది వరకు ఢిల్లీలో స్కూల్స్ లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తామని దుండగులు ఈ మెయిల్స్, కాల్స్ ద్వారా బెదిరింపులకు దిగిన విసయం తెలిసిందే. అంతేకాకుండా ఎయిర్‌పోర్టులను పేల్చి వేస్తామని హెచ్చరించారు. అదే విధంగా వినాయక చవితి వేడుకల సందర్భంగా ముంబాయిలోని ప్రధాన కూడళ్లలో బాంబులు ఏర్పాటు చేశామని, కొన్ని క్షణ్ణాల్లో వినాశమవుతుందని మెయిల్స్ పంపారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోని మౌలాన ఆజాద్ మెడికల్ యూనివర్సిటీని బాంబుతో ధ్వంసం చేస్తామని పోలీస్ సెక్రటరీకి కార్యాలయానికి మెయిల్స్ పంపించారు.
అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది..ఆ యూనివర్సిటీ పరిసరాలతో పాటు కాలేజ్‌లో తనిఖీలు చేపట్టారు. డాగ్ డాగ్ స్క్వాడ్ తో సమగ్ర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఏ విధమైనా పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఆనవాళ్లు లేనట్లు గుర్తించామని అదనపు డీసీపీ రిషి, ఏసీపీ కమలా మార్కెట్ సులేఖ వెల్లడించారు. ఈ తరహా బెదరింపు మెయిల్స్ విచారణ చేస్తున్నామని చెప్పారు.