నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ సర్వసాధారణమైపోయాయి. తాజాగా, ఇవాళ ఉదయం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానంలో బాంబు పెట్టామంటూ ఆగంతకుడి నుంచి స్టాఫ్‌కు ఈ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇండిగో విమానం కువైట్ నుంచి అర్ధరాత్రి 1.30 నిమిషాలకు హైదరాాబాద్‌కు బయలుదేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 8.10కి ఫ్లైట్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఫ్లైట్ సిబ్బందికి బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో సదరు విమానాన్ని హుటాహుటిన ముంబైకి మళ్లించారు. అయితే, ఇప్పటి వరకు ఆ ఇండిగో విమానం ఇంకా ముంబైలో ల్యాండ్ అవ్వనట్లుగా తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామంతో అసలు ఏం జరుగుతోందో తెలియక పైలట్లతో పాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిబ్బందితో పాటు ముంబై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
- Advertisement -
- Advertisement -



