Monday, December 1, 2025
E-PAPER
Homeజాతీయంకేరళ ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు..

కేరళ ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు బెదిరింపులు వచ్చాయి. సీఎం అధికారిక నివాసంతోపాటూ పాలయంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకు, సీఎం వ్యక్తిగత కార్యదర్శికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. సీఎం నివాసంతోపాటూ, మిగతా రెండు చోట్లా బాంబులు పెట్టినట్లు ఆగంతకులు మెయిల్‌ పంపించారు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో రెండు చోట్లా తనిఖీలు చేశారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బెదిరింపు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -