- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
సర్పంచుగా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని బొమ్మలరామారం గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఆదివారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఉంగరం గుర్తుపై తమ ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఊరులోనే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని అదేవిధంగా రోడ్డు గుంతలు పూడ్చి పునర్నిర్మించి,మిగిలిన సిసి రోడ్లు, డ్రైనేజీలను వేయిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో వార్డు మెంబర్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -



