Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బషీరాబాద్ పాఠశాలలో బోనాల పండుగ

బషీరాబాద్ పాఠశాలలో బోనాల పండుగ

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల నుంచి గ్రామ శివారులోని ముత్యాలమ్మ ఆలయం వరకు వరకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ముత్యాలమ్మ వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, బోనాలను సమర్పించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా పలువురు విద్యార్థులు అమ్మవార్ల వేషధారణలో అలరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad