నవతెలంగాణ – పిట్లం
మండల కేంద్రంలోని గ్రామ పొలిమేరలో గల బారెడు పోచమ్మ బోనాల పండుగను ఆదివారము గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బారేడు పోచమ్మ అమ్మవారికి తీపి వంటకాల నైవేద్యంతో పాటు పాటు సారే సమర్పించారు. కాగా పాత గ్రామపంచాయతీ ( చావిడి ) నుండి బ్యాండు , భాజా భజంత్రీలతో పలు కాలనీల మహిళలు భారీ సంఖ్యలో బారెడు పోచమ్మ ఆలయం వరకు బోనాలను ఊరేగించారు. శివసత్తుల మహిళలు బోనాలు ఎత్తుకొని చేసిన నృత్యాలు , విన్యాసాలు పోతురాజుల విన్యాసాలు , నృత్య గంభీరతత్వము చూపరులను , చిన్నారులను ఆకట్టుకున్నాయి. కాగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బారెడు పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో పెద్ద ఎత్తున జాతర నెలకొంది. బోనాల పండుగకు విచ్చేసిన ప్రజలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. దీంతో మండల కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , ఆలయ కమిటీ సభ్యులు , ప్రజా ప్రతినిధులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పిట్లంలో ఘనంగా బోనాల పండుగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES