నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరంలోని 17వ డివిజన్ అభయహస్తం కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అభయహస్తం కాలనీలో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు. కాలనీ ప్రజలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, అభయ హస్తం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు థ్యారంగుల కృష్ణ లు మాట్లాడుతూ ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి సిరిసంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే అభయ హస్తం కాలనీ నీ మోడల్ కాలనీగా మార్చేందుకు కృషి జరుగుతుందని, అది త్వరగా నెరవేరాలని కోరుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, భాస్కర్, మంజుల, కల్పన, కొమురయ్య, రామచందర్, కుటుంబ సభ్యులతో అభయ హస్తం కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
అభయ హస్తం కాలనీలో బోనాల పండుగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES