- Advertisement -
ఉప్పలమ్మ తోట్టేలో కార్యక్రమం..
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం లోని స్థానిక ఆర్.బి.నగర్ అర్బన్ కాలనీలో బోనాల పండుగను ఆదివారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఉదయము గ్రామదేవతలకు నైవేద్యాన్ని బోనాల రూపంలో సమర్పించారు. ఆర్.బి నగర్ లొ ఉప్పలమ్మ తోట్టేలా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పీసీసీ డెలిగేట్ తాంగ్గెళ్లపల్లి రవి కుమార్, ముఖ్య అతిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తు అమ్మ వారి ఆశీస్సులు భువనగిరి ప్రజలు పై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎండీ అజీమ్ పాల్గొన్నారు.
- Advertisement -