Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సన్ షైన్ స్కూల్లో ఘనంగా బోనం పండగ వేడుకలు.

సన్ షైన్ స్కూల్లో ఘనంగా బోనం పండగ వేడుకలు.

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని హంగర్గ గ్రామంలో పరిధిలో స్థాపించిన సన్ షైన్ పాఠశాలలో కరస్పాండెంట్ శివకుమార్ మాలి పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను విద్యార్థులతో ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలొ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు బతుకమ్మ ఆడుతూ.. ఆటపాటలతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలో ఉండి నాటికలు వేశారు. బాలికలు సాంప్రదాయ బద్దంగా కట్టుబొట్టు నిర్వహించి అమ్మవారి వేషధారణలో బోనాలు ఎత్తుకొని డప్పు, వాయిద్యాలు, భజంత్రీల భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు సమర్పించారు.

అనంతరం పిండి వంటలతో చేసిన నైవిద్యాలను భగవంతునికి సమర్పించి నడిపించిన అనంతరం అమ్మవారు తమకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని దీవెనలు కోరుతూ మొక్కులు తీర్చుకున్నారు . అనంతరం ఉపాధ్యాయిని , ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు సహ పంక్తీ భోజనాలు చేశారు. బోనాల పండుగ సందర్భంగా విద్యార్థిని , విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా , ఆటపాటలతో హుషారుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివకుమార్, ప్రిన్సిపాల్ అశోక్, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థిని విద్యార్థులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -