Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబోనస్‌ చెల్లించాలి

బోనస్‌ చెల్లించాలి

- Advertisement -

తెలంగాణ మీ-సేవ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వినతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దసరా సందర్బంగా మీ-సేవ సిబ్బందికి అక్టోబర్‌లో బోనస్‌ చెల్లించాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సంజరుకుమార్‌కు యూనియన్‌ నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవలను మీ-సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఆధార్‌, కొత్త రేషన్‌ కార్డులు, పాన్‌ కార్డులు తదితర కొత్త సర్వీసులు వీటిలో ఉన్నాయని పేర్కొన్నారు. సిబ్బంది శ్రమను, కృషిని సీఎం రేవంత్‌రెడ్డి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు పలుమార్లు ప్రశంసించారని గుర్తు చేశారు. ప్రజల సౌకర్యార్ధం ప్రవేశపెట్టిన అనేక సేవల వల్ల తమకు పని భారం పెరిగినప్పటికీ పట్టుదలగా చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని మూడేండ్ల నుండి దసరా పండుగ సందర్భంగా బోనస్‌ చెల్లించాలని కోరుతున్నామని తెలిపారు. వినతి పత్రాన్ని అందజేసిన వారిలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె వెంకటేశ్‌, అధ్యక్షులు ఆర్‌ సురేశ్‌,ప్రధాన కార్యదర్శి వై కవిత,కోశాధికారి లక్ష్మి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ ప్రకాశ్‌నాయక్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ ఇల్యాజ్‌, బాలకృష్ణ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -