- Advertisement -
మండల వ్యవసాయ అధికారి గిరిప్రసాద్
నవతెలంగాణ – కట్టంగూర్
రైతులు మొబైల్ యాప్ ద్వారా తమకు కావలసిన యూరియాను బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి యెడవల్లి గిరిప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన కట్టంగూరులో విలేకరులతో మాట్లాడారు. భూ యజమానులు, రైతులు, పట్టాదారులు, కౌలు రైతులు పట్టాదారు పాస్ బుక్ కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ తో ఓటిపి నమోదు చేయడం ద్వారా మండలంలో అందుబాటులో ఉన్న యూరియా దుకాణాల వివరాలు తెలుపుతుందని, ఎకరాకు మూడు బస్తాల చొప్పున తమ అవసరం మేరకు ఎక్కడ లభిస్తుందో చూసుకొని కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. మరిన్ని వివరాలకు విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు.
- Advertisement -



