Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంసరిహద్దు ఉగ్రవాదం..భార‌త్, చైనాల‌కు ముప్పే: పీఎం మోడీ

సరిహద్దు ఉగ్రవాదం..భార‌త్, చైనాల‌కు ముప్పే: పీఎం మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సరిహద్దు ఉగ్రవాదం భారత్‌తో పాటు చైనాపైనా ప్రభావం చూపుతోంద‌ని, ఇరు దేశాలకూ ఇదొక సవాల్‌గా మారిందని పీఎం మోడీ అన్నారు. ఈ సమస్యను ఎదుర్కొనడానికి పరస్పర సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిణమించిందని తియాన్‌జిన్‌ వేదికగా సోమవారం జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు

SCO సదస్సు వేదికలో పాకిస్తాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదు అని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad