నవతెలంగాణ హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. సెలవులు ముగిసినా బడికి వెళ్ళడానికి ఇష్టపడని 14 ఏళ్ల బాలుడు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయదుర్గంలో చోటుచేసుకుంది.
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం, అక్కలరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఈ కుటుంబం 15 ఏండ్లుగా రాయదుర్గంలోనే నివాసం ఉంటోంది.న్యూఇయర్ , పని,ఆదివారాలు వరుస సెలవులతో సరదాగా గడిపిన బాలుడు సోమవారం బడికెళ్లడానికి ఇష్టపడటం లేదు. దీనిని గమనించిన తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రమే రేపటినుంచి కచ్చితంగా బడికి వెళ్లాలని చెప్పడంతో బాలుడు మనస్తాపం చెందాడు, క్షణికావేశంలో తల్లి బయట పనిలో ఉండగా ఇంట్లోనే రేకుల పైకప్పు రాడ్డునకు ఉరేసుకున్నాడు. తల్లి వచ్చి చూసేసరికి బాలుడు మృతి చెంది ఉన్నాడు.



