– వీవో లకు శిక్షణ
– ఎంఈఓ ప్రసాదరావవు
నవతెలంగాణ – అశ్వారావుపేట : నిరక్షరాస్యులు ను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా విలేజ్ ఆర్గనైజర్ లను ఎంపిక చేసి వారికి అక్షరాస్యతా కార్యాచరణ చేపట్టామని ఆయన తెలిపారు. ఇందుకోసం ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు,వీవో లకు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ఒక రోజు శిక్షణను ఆర్పీ లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీల నుండి ఒక్కోపంచాయతీ నుండి ఒక ఉపాధ్యాయునికి, ఒక వీవో కి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది అన్నారు. ఈనెల 28 వ తేదీన గ్రామస్థాయిలో వీరిద్దరూ వాలంటీర్లకు శిక్షణ ఇస్తారని తెలిపారు.మండలం మొత్తం 286 మంది వాలంటీర్లు, 2860 మంది నిరక్షరాస్యులు ను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ లు శ్రీశైలం,రాము,క్రిష్ణా రావు లు పాల్గొన్నారు.
అక్షరాస్యత పెంపుదలకు ఉల్లాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES