Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకొత్త ఏడాదిలో అంగన్‌వాడీల్లో అల్పాహారం

కొత్త ఏడాదిలో అంగన్‌వాడీల్లో అల్పాహారం

- Advertisement -

సీఎం నిర్ణయం నిధులు సమకూర్చాలంటూ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నూతన సంవత్సరంలో నూతన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీల నుంచే వీటిని ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు, గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లోని అంగన్‌వాడీలను నాలుగు విభాగాలుగా వర్గీకరించాలంటూ సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. పిల్లల్లోని పోషకాహార లోపం, రక్తహీనత తదితర రుగ్మతలను గుర్తించి, భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా అంగన్‌వాడీల్లో పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని అందించాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖకు సూచించారు. ఇప్పటి వరకు ఆయా కేంద్రాల్లో ఉదయం పూట పాలు, ఇతర తినుబండారాలనే పిల్లలకు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త స్కీమ్‌ ప్రారంభమైతే ఉప్మా, కిచిడీ, కోడిగుడ్డుతో చేసిన అల్పాహారాలను అందించాలని ముఖ్యమంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులకు సూచించినట్టు సమాచారం. ఇందుకు అవసరమయ్యే బడ్జెట్‌ను అంచనా వేసి, ఆ మేరకు నిధులను సమకూ ర్చాలంటూ ఆయన ఆర్థికశాఖను ఆదేశిం చారు. ఆ ప్రక్రియ ంతా పూర్తయితే జనవరి నుంచే అల్పాహార పథకాన్ని అమలు చేస్తామని సీఎంవో వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -