నవతెలంగాణ – మాక్లూర్
పుట్టిన బిడ్డకు తల్లి పాలే ముఖ్యమని సిడీపీఓ జ్యోతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పోషణ మాసం అనగాహన కార్యక్రమం మండల అంగన్ వాడి ల ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీడీపీఓ డిచ్ పల్లి జ్యోతి పాల్గొని మాట్లాడారు. పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఒక కిషోరీ బాలిక కాబోయే తల్లి, కావున కిషోరీ బాలిక నుంచే సమతుల ఆహారం అందించాలని సూచించారు. గర్భవతి మంచి ఆహారం తీసుకోవడం వల్ల మంచి బిడ్డను జన్మినిస్తుందనీ అన్నారు.
బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టాలని ఆ పాలతో పిల్లలకి 5 సంవత్సరాల వరకు వ్యాధి నిరోధక శక్తి వుంటుందని తప్పని సరిగా బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని, 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్యాలని, తల్లిపాలు తప్ప వేరే ఏ ఇతర పానియాలు ఇవ్వకూడదని, అలాగే 2 సం॥ రాలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, తల్లిపాలతో పాటు 7వ నెలలో అనుబంధ ఆహారం తినిపించాలని సూచించారు. అంగన్ వాడి కేంద్రంలో అందించే సేవలు వాటి గురించి వివరించరు. ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్ సూపర్వైజర్స్ మమత, సునిత, వీరలక్ష్మి, పోషణ అభియాన్ కో-ఆర్డినేటర్ రంజిత్, హెల్త్ సూపర్ వైజర్స్ సుధాకర్, ప్రమీలా, ఏఎన్ఎం లు, వ్యవసాయ విస్తరణ అధికారి మహేందర్, తల్లులు, అంగన్ వాడి టీచర్స్, ఆయాలు పాల్గొన్కారు.
బిడ్డకు తల్లి పాలే ముఖ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES