- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
బిడ్డల శారీరక, మానసిక ఎదుగుదలకు అమ్మపాలే కీలక పాత్ర వహిస్తాయని, అప్పుడే పుట్టిన శిశువులను మొదలుకొని ఆరు నెలల వరకు అమ్మపాలే తప్పక పట్టించాలని ఐసీడీఎస్ దుబ్బాక సెక్టార్ సూపర్వైజర్ ఎన్.చంద్రకళ స్పష్టం చేశారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం దుబ్బాక మండలం గంభీర్ పూర్ లోని అంగన్వాడీ సెంటర్ లో పలువురు బాలింతలకు అమ్మ పాల ప్రాముఖ్యతను వివరిస్తూ శిశువులకు పాలు పట్టే విధానం పై అవగాహన కల్పించారు. వారి వెంట ఏఎన్ఎం జయంతి, ఆశాలు వసుంధర, శోభ, అంగన్వాడీ టీచర్లు పద్మలత, నాగలక్ష్మి పలువురున్నారు.
- Advertisement -