Monday, August 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యకరం

తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యకరం

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
తల్లి పాలు బిడ్డకు ఆరోగ్యకరమని తరోడ  అంగన్వాడి కేంద్రం  కార్యకర్త హర్షయా తబుసం అన్నారు. ముధోల్ మండలంలోని తరోడ అంగన్వాడి కేంద్రం 2లో సోమవారం తల్లి పాల వారోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలను తాగించాలన్నారు. పిల్లలకు తల్లిపాలు అమృత లాంటిదిన్నారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పోషకారాన్ని తీసుకోవాలన్నారు.

అంగన్వాడి కేంద్రం ద్వారా పంపిణీ చేస్తున్న పోషకారాన్ని  సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల సూచన, సలహాలను,  పాటించాలన్నారు. ఆనంతరం పిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సమైక్య అధ్యక్షురాలు ముత్తవ్వ, ఆశా కార్యకర్త అప్సరీ బేగం, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -