పుట్టిన బిడ్డకు వెంటనే తల్లి పాలు అందించాలి
మేచరాజు పల్లి సెక్టార్ ఇన్చార్జి
ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మేచరాజుపల్లి సెక్టార్ పరిధిలోని బాడవ తండాలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఆ సెక్టర్ ఇన్చార్జి ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి తెలిపారు. బుదవారం బాడవ తండాలో అంగన్వాడి సెంటర్ వద్ద గర్భిణీలకు బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందనేది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అవగాహన కల్పించారు.
పుట్టిన బిడ్డకు వెంటనే తల్లి నుండి వచ్చి ముర్రుపాలను అందిస్తే ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని అన్నారు. అంతేకాకుండా పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు బరువు తగ్గ ఎత్తు ఎదుగుతారని అన్నారు అంగన్వాడి కేంద్రాల్లో అందించి పౌష్టిక ఆహారాన్ని గర్భిణీలు బాలింతలు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు కవిత సరోజ లీలావతి శుభోదర పద్మ ఆయాలు ఏఎన్ఎం ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES